మణిపూర్ లో మళ్లీ అల్లర్లు.. భద్రతా సిబ్బంది – కుకీల మధ్య ఘర్షణ,

 

భద్రతా సిబ్బంది – కుకీల మధ్య ఘర్షణ, ఒకరు మృతి, ఏడుగురు అరెస్ట్ మణిపూర్ లో మళ్లీ హింస చెలరేగింది. అమిత్ షా ఆదేశాలను నిరసిస్తూ అల్లర్లు జరుగగా భద్రతా సిబ్బంది కుకీల మధ్య ఘర్షణ నెలకొంది. ఈ ఘటనలో ఒకరు మృతి, 40 మందికి గాయాలు అయ్యాయి.

ప్రైవేటు వాహనాలకు నిప్పుపెట్టారు నిరసనకారులు. ఇక అలాగే ఇంఫాల్-దిమాపూర్ జాతీయ రహదారిపై కుకీలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. మణిపూర్ లో వాహనాలు స్వేచ్ఛగా రాకపోకలకు సాగించేందుకు కేంద్ర హోం మంత్రి అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Facebook
WhatsApp
Twitter
Telegram