పంట పొలంలో రైతు వినుత్న నిరసన

ద్విచక్రవాహనంతో పంట పొలాన్ని తొక్కించి ఆవేదన తెలిపిన రైతు

గోల్డెన్ న్యూస్/ సూర్యాపేట : మునగాల మండలం ఓ రైతు వినూత్న రీతిలో నిరసన తెలిపాడు. తన పంట పొలానికి నీళ్లు రాకపోవడంతో ఎండిపోయిన వరి చేలో తన ద్విచక్ర వాహనంతో పొలంలో చక్కర్లు కొట్టాడు. సాగునీరు వస్తాయనే ఆశతో ఏడు ఎకరాలు కౌలుకు తీసుకుని వరి సాగు చేశానని ఆవేదన వ్యక్తం చేశాడు. అధిక పెట్టుబడుల కారణంగా అప్పుల పాలు కావడమే కాక, చేతికొచ్చిన పంట నీళ్లు లేక ఎండిపోయిందని వాపోయాడు. ఇప్పటికైనా ప్రభుత్వం సాగు నీరందించి రైతులను ఆదుకోవాలని ఆ ప్రాంత రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram