ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు ప్రకటించిన కాంగ్రెస్

ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసిన ఏఐసీసీ..

అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్ పేర్లను ప్రకటించిన ఏఐసీసీ..

ఒక స్థానాన్ని సీపీఐకి కేటాయించిన అధిష్టానం..

గోల్డెన్ న్యూస్ /హైదరాబాద్ :;తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థులను ఫైనల్ చేసింది. అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి పేర్లను కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ఖరారు చేశారు. ఒక స్థానాన్ని సీపీఐకి కేటాయించారు. అసెంబ్లీలో సంఖ్యాబలంను బట్టి కాంగ్రెస్ కు 4 స్థానాలు దక్కగా.. అసెంబ్లీ ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు ఒక స్థానాన్ని సీపీఐకి కేటాయించింది. విజయశాంతి, అద్దంకి దయాకర్, కేతావత్ శంకర్ నాయక్ లను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఖరారు చేస్తూ కాంగ్రెస్ అధిష్టానం ప్రకటన జారీ చేసింది.

 

 

Facebook
WhatsApp
Twitter
Telegram