టీమిండియాదే ఛాంపియన్స్ ట్రోఫీ
దుబాయ్: న్యూజిలాండ్తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమ్ ఇండియా అదరగొట్టింది 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేయగా. ఈ లక్ష్యాన్ని భారత్ ఆరు బంతులు మిగిలుండగానే 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. రోహిత్ శర్మ (76; 83 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్ లు కెప్టెన్ ఇన్నింగ్స్ అదరగొట్టాడు. విరాట్ కోహ్లి (1) తీవ్ర నిరాశపర్చాడు. శ్రేయస్ అయ్యర్ 48; 62 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్ లు, కేఎల్ రాహుల్ 34 శుభ్మన్ గిల్ 31 అక్షర్ పటేల్ (29), హార్దిక్ పాండ్య (18), రవీంద్ర జడేజా 9 పరుగులు చేశారు. భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం ఇది మూడోసారి. 2002లో శ్రీలంకతో కలిసి సంయుక్త విజేతగా నిలవగా.. 2013లో ఇంగ్లాండ్ను ఓడించి ఛాంపియన్గా అవతరించింది.
Post Views: 26