హనుమకొండలో రోడ్డు ప్రమాదం.

సుబేదారి సిగ్నల్ వద్ద ఘటన నలుగురికి గాయాలు

గోల్డెన్ న్యూస్ / హన్మకొండ  : సుబేదారి అటవీ శాఖ కార్యాలయం జంక్షన్ వద్ద పెను ప్రమాదం తప్పింది. మంగళవారం తెల్లవారుజామున ఇన్నోవా కారును తప్పించబోయిన గ్రానైట్ లారీ డ్రైవర్‌ డివైడర్‌ను డీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రానైట్ లారీని గమనించకుండా ఇన్నోవా డ్రైవర్ మద్యం మత్తులో కారు నడపడంతోనే ఈ ప్రమాదం జరిగిందని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.ప్రమాదం కారణంగా గ్రానైట్ బండలు లారీ పైనుంచి కింద పడటంతో ట్రాఫిక్ సిగ్నల్స్ పోల్స్, సీసీ కెమెరాలు దెబ్బతిన్నాయి. ఆ సమయంలో ఎదురుగా వాహనాలు రాకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. లారీ డ్రైవర్‌తోపాటు, కారులో ఉన్న వారు స్వల్ప గాయాలతో సేఫ్ గా బయట పడ్డారు.

Facebook
WhatsApp
Twitter
Telegram