పాకిస్తాన్లో రైలు హైజాక్; 100 మందికి పైగా బందీలు

నైరుతి పాకిస్తాన్ లో మంగళవారం ప్యాసింజర్ రైలుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. రైలు డ్రైవర్ కు గాయాలయ్యాయి. పలువురు ప్రయాణికులు చనిపోయినట్లు సమాచారం. కాగా, ఉగ్రవాదులు సుమారు 100 మంది ప్రయాణికులు, సెక్యూరిటీ సిబ్బందిని బందీలుగా పట్టుకున్నట్లు తెలుస్తోంది.

బలూచిస్థాన్ నైరుతి ప్రావిన్స్ లోని క్వెట్టా నుంచి ఖైబర్ పఖ్తుంఖ్వాలోని పెషావర్ కు వెళ్తున్న జాఫర్ ఎక్స్ ప్రెస్ రైలుపై ఉగ్రవాదులు దాడి చేశారు. అయితే, డ్రైవర్ తో పాటు ప్రయాణికులపై కూడా ఉగ్రవాదులు కాల్పులు జరిపారని, టెర్రరిస్ట్ ల కాల్పుల్లో డ్రైవర్ గాయపడగా, పలువురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది. అయితే, ఈ విషయంపై ఇంతవరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. కాగా, సుమారు 100 మందికి పైగా ప్రయాణికులు, సెక్యూరిటీ సిబ్బందిని ఉగ్రవాదులు బందీలుగా పట్టుకున్నారని సమాచారం.
Facebook
WhatsApp
Twitter
Telegram