గోల్డెన్ న్యూస్ / వెబ్ డెస్క్ : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో రెండు కొత్త కరెన్సీ నోట్లు విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. త్వరలోనే రూ.100, రూ.200 నోట్లను జారీ చేయనున్నట్లు తెలిపింది. ఆర్బీఐ కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా నియమితులైన నేపథ్యంలో ఆయన సంతకంతో ఈ నోట్లు రానున్నాయి. అయితే ఈ కొత్త నోట్లు మహాత్మా గాంధీ సిరీస్ తోనే ఉంటాయని ఆర్బిఐ పేర్కొంది. అవి అందుబాటులోకి వచ్చినా పాతవి చెల్లుతాయని వెల్లడించింది. ఎన్డీఏ హయాంలో పెద్ద నోట్ల రద్దు సమయంలో రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసి, కొత్తగా రూ. 2 వేల నోట్లను ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే.
అదే సమయంలో ఎర్రకోటను కలిగి ఉన్న కొత్త రూ.500 నోట్లను కూడా ప్రవేశపెట్టారు. అయితే 2023లో రూ.2 వేల నోట్లను కూడాఆ రద్దు చేశారు. ఈ మధ్యకాలంలోనే కొత్త రూ.20, 50, 100, 200 నోట్లను కూడా ఆర్బీఐ తీసుకు వచ్చింది. తాజాగా మరో రెండు కొత్త నోట్లను త్వరలో విడుదల చేయబోతోంది.
Tags: