గోల్డెన్ న్యూస్ / కరకగూడెం : మండలంలో నీరు లేక నెర్రెలిస్తున్న పొలాలు భద్రాద్రి కొత్తగూడెంజిల్లాలో పంట పొలాలు పశువుల కొట్టాలుగా మారుతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటి బోరు బావుల్లో నీళ్లు రాక పంటలన్నీ ఎండుతున్నాయి. కరకగూడెం మండలంలో చందా మధు అనే రైతు నాలుగు ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేయడం జరిగింది పంట చేతికందే టైములో నీరు లేక ఎండి పోతుంది. వేల రూపాయలు ఖర్చుపెట్టి వంట సాగు చేస్తే కళ్ళముందే ఎండిపోతుందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారిన రైతు తలరాతలు మారడం లేదన్నారు. రైతుకు 24 గంటలు కరెంటు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం 17 గంటలు ఇస్తుంది అందులో ఎల్ సి రూపంలో మాటిమాటికి కట్ చేస్తున్నారని అన్నారు. అంతేకాకుండా మండలంలో వరి, మక్క చేన్లు బీడువారుతున్నయి. గత ఏడాది వరకు యాసంగిలో పుష్కలంగా పంటలు పండించుకొన్న రైతులు. ఈ ఏడు పొలాలు పడావు పడుతుంటే తండ్లాడుతున్నరు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే పంటలు ఎండిపోయాయి. చేతికి వచ్చిన పంటలు ఎండుతుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో పశువుల మేతకు ఉపయోగిస్తున్నారు.
