బోర్డుకే పరిమితమైన క్రీడా ప్రాంగణాలు.

       నిరుపయోగంగా క్రీడా ప్రాంగణాలు

గోల్డెన్ న్యూస్ / కరకగూడెం : క్రీడాకారులను ప్రోత్స హించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీకి ఒక క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేసింది. బారాస హయాంలో మూడేళ్ల కిందట అన్ని గ్రామాల్లో ఏకకాలంలో హడావిడిగా ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. గ్రామాలలో ఖాళీ ప్రదేశాలు, ప్రభుత్వ స్థలాలు, పాఠశాలల మైదానాలు, గ్రామ శివారులోని స్థలాలను గుర్తించి వాటిని క్రీడా ప్రాంగణాలుగా ఏర్పాటు చేశారు. ఎంపిక చేసిన ప్రాంతాల్లో బోర్డులు ఏర్పాటు చేసి  తమ పని అయిపోయిందన్నట్లు చేతులు దులుపు కున్నారు. దీంతో  ప్రాంగణాల్లో ముళ్ల కంప ఏపుగా పెరిగి ఆటలాడటానికి వీల్లేని విధంగా ఉన్నాయి.

అన్ని పంచాయతీల్లో.

పంచాయతీకి ఒకటిచొప్పున మండలంలోని పలు అన్ని  గ్రామ పంచాయతీల్లోనూ క్రీడ  మైదానాలను ఏర్పాటు చేశారు. ఎంపిక ప్రక్రియలో లోపించిన చిత్తశుద్ధి కారణంగా ప్రస్తుతం అవి నిరు పయోగంగా మారడంతో క్రీడాకారుల పాలిట శాపంగా తయారైంది. ప్రజాప్రతినిధులు, అధికా రులు వీటిపై దృష్టిసారించకపోవడంతో నిర్జన ప్రదే శాలుగా మారాయి. ఒకటి రెండు ప్రాంతాల్లో మినహా మరెక్కడా వినియోగంలో లేవు. కొన్ని చోట్లు అనువుగాని ప్రాంతాలకూ బోర్డులు తగిలిం చేశారు. మైదానాలను అభివృద్ధి  చేసి వినియోగంలోకి తేవాలని అధికారులను గ్రామాల్లోని  యువకులు కోరుతున్నారు..

 పడిగాపురంలో ఏర్పాటు  చేసిన: క్రీడాప్రాంగణం

చదును చేయడం, బోర్డులు ఏర్పాటు చేయడం, క్రీడా సామగ్రి కొనుగోలు తదితరాలకు కలిపి ఒక్కో మైదానానికి రూ.80 వేల వరకు ఖర్చు చేశారు. ఇంత చేసినా నిర్వహణ లోపం కారణంగా పిచ్చి మొక్కలు ముళ్లపొదలతో ఉన్నాయి. కనీసం అటువైపు కన్నెత్తి చూడని అధికారులు. ప్రస్తుతం ప్రాంగణాలు నిరుపయో గంగా మారాయని. కనీసం కొత్త ప్రభుత్వమైనా విని యోగంలోకి తీసుకురావాలని క్రీడాకారులు కోరుతున్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram