గోల్డెన్ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం : కరకగూడెం మండలం రఘునాథపాలెం దొనలగుట్టలో గత ఏడాది సెప్టెంబరు 5న పోలీసులకు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చందగా, ఇద్దరు గ్రేహౌండ్స్ కానిస్టేబుల్స్ కు గాయాలైన విషయం తెలిసిందే. బుధవారం భద్రాచలం ఆర్డీవో దామోదర్ ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ మేరకు ఆర్డీవో మాట్లా డుతూ.. మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి విచారణ చేయడం జరిగిందన్నారు. ఈ నివేదికను జిల్లా కలెక్టర్ కు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఆయన వెంట ఆస్ఐ కృష్ణ ప్రసాద్, రఘనాధ పాలెం గ్రామస్థులు పాల్గొన్నారు..
Post Views: 18