మద్యానికి బానిసలైన భార్యలపై పోలీసులకు భర్తల ఫిర్యాదు

గోల్డెన్ న్యూస్ / వెబ్ డెస్క్ : భర్తలు మద్యానికి బానిసలై కష్టం చేసిన డబ్బులు అన్ని మందు తాగడానికి ఖర్చు చేస్తున్నారని భర్తల నుంచి తమ రక్షణ కల్పించాలని మహిళలు గ్రామ పెద్దలు, పోలీసులను సంప్రదించారు వారు. కానీ మానవ జీవన విధానంలో పరిస్థితులు మారిపోయాయి. భార్యలు సైత భర్తలతో సమానంగా జీవిస్తున్నారు. అన్ని రంగాల్లో వారు రాణిస్తూ..పురుషులకు తామేమీ తక్కువ కాదని నిరూపిస్తున్నారు. ఇలా మంచిలోనే కార్యక్రమాల్లోనే కాకుండా .. చెడు కార్యక్రమాల్లోనూ జరుగుతోంది. ఇందుకు ఉదాహరణ ఒడిశా – కొరాపుట్ జిల్లా పూజారి పుట్ పంచాయతీలో చోటు చేసుకున్న సంఘటనే నిదర్శనం

ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఒడిశా – కొరాపుట్ జిల్లా పూజారి పుట్ పంచాయతీలోని కొండగూడ గ్రామంలో తమ భార్యలు మద్యానికి బానిసలు అయ్యారని పోలీసులకు, ఆబ్కారీ అధికారులకు బాధిత భర్తలు ముకుమ్మడిగా  ఫిర్యాదు చేశారు. అంతా కలిసి స్టేషన్ వెళ్లిన భర్తలు.. తాము పగలంతా కష్టపడి కూలి చేసి తెచ్చిన డబ్బులను ఇంటి వద్ద ఉన్న తమ భార్యలు మద్యానికి ఖర్చు చేస్తున్నారని, వారి గ్రామంలో విపరీతంగా నాటుసారా తయారు చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకొని, తమ భార్యలకు మద్యం అలవాటు మానేసేలా చేయాలని   ఆ గ్రామానికి చెందిన భర్తలు అధికారులను కోరారు. స్పందించిన పోలీసులు గ్రామంలో మద్యం అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది.

Facebook
WhatsApp
Twitter
Telegram