సైబర్ నేరగాళ్ల వల్లలో చిక్కి .. రూ.3.44 లక్షలు పోగొట్టుకున్న వ్యక్తి

గోల్డెన్ న్యూస్ / కూసుమంచి:  ఓ వ్యక్తి సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి రూ.3.44 లక్షల పోగొట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కూసుమంచికి చెందిన ఉపేందర్ అనే వ్యక్తి వరి కోత యంత్రాల ఏజెంట్గా పని చేస్తున్నాడు. రెండు రోజుల క్రితం అతనికి ఫోన్ లో పీఎం కిసాన్ యోజనకు సంబంధించిన లింకు రావడంతో ఓపెన్ చేశాడు. తనకు పీఎం కిసాన్ యోజన పథకానికి సంబంధించిన సాయం అందకపోగా, నేరగాళ్లు అడిగిన ఆధార్ వివరాలతో సహా అన్ని వివరాలను అందులో పొందుపరిచాడు. అయితే అతని బ్యాంక్ ఖాతా నుంచి రెండు విడతలుగా రూ.3.44 లక్షలు డ్రా అయినట్లు గుర్తించాడు. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

 

Facebook
WhatsApp
Twitter
Telegram