గోల్డెన్ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం : కలెక్టరేట్లో మార్చి17 వ తేదీ సోమవారం రోజు నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమమును రద్దు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ ఎస్టి కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ సోమవారం మరియు మంగళవారం జిల్లా పర్యటన ఉన్నందున జిల్లా అధికార యంత్రాంగం అంతా పర్యటనలో పాల్గొనున్నారని. ఇందులో భాగంగా సోమవారం జరగనున్న ప్రజావాణి కార్యక్రమమును రద్దు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలు గమనించాలని దరఖాస్తులు ఇవ్వడానికి ఐ డి ఓ సి కార్యాలయానికి రావద్దని సూచించారు.
Post Views: 20