హనీ ట్రాప్‌లో ఇరుక్కున్న 48 మంది ఎమ్మెల్యేలు

బెంగళూరు :  యువతుల్ని ఎరగా వేసి తమకు అవసరమైన సమాచారాన్ని రాబట్టడాన్ని’హనీ ట్రాప్’ అంటారు. ఈ మధ్య కాలంలో మనం తరుచుగా హనీట్రాప్ అనే పేరును వింటూనే ఉన్నాం. ఇప్పడీ హనీ ట్రాప్ వలలో సుమారు 48 మంది ఎమ్మెల్యేలు పడ్డారని ఓ రాష్ట్రానికి చెందిన మంత్రి అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంపై దుమారం చెలరేగింది.

జాతీయ స్థాయి నేతలు సహా, మంత్రులు, ఎమ్మెల్యేలు మొత్తం 48 మంది రాజకీయ నాయకులు హనీ ట్రాప్ ఉచ్చులో పడ్డారని అసెంబ్లీలో వ్యాఖ్యలు చేసిన సహకార శాఖ మంత్రి కేఎన్ రాజన్న

48 మంది నాయకుల అసభ్య వీడియోలు సీడీలు, పెన్ డ్రైవ్ లో ఉన్నాయని.. ఇందులో అధికార, విపక్ష పార్టీ సభ్యులు ఉన్నారని తెలిపిన మంత్రి

కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో ఇటీవల కర్ణాటకలో ఇద్దురు మంత్రులపై హనీ ట్రాప్ ప్రయత్నాలు జరిగాయని పీడబ్ల్యూడీ మంత్రి సతీష్ జార్కిహొళి అసెంబ్లీలో వెల్లడించారు. సీడీలు, పెన్ఫ్లవ్లలో వారి అసభ్య వీడియోలు ఉన్నాయన్నారు. అధికారపక్షం సహా విపక్షానికి చెందిన వారు ఈ బాధితుల్లో ఉన్నారని అన్నారు

ఈ అంశంపై రాష్ట్ర హోంశాఖ ఫిర్యాదు చేస్తానని నేను వెనక ఎవరున్నారు అన్నయ్య విషయం ప్రజలకు కూడా తెలియాలని విచారణ ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు.

 

 

 

 

Facebook
WhatsApp
Twitter
Telegram