గోల్డెన్ న్యూస్ / కరకగూడెం : పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభం అయ్యాయి. శుక్రవారం తొలి రోజు పరీక్ష కావడంతో విద్యార్థులతో పాటు వెంట తల్లి తండ్రులు పిల్లల్ని తీసుకొని పరీక్ష కేంద్రాలకు వచ్చారు. తొలిరోజు కావడంతో పరీక్ష కేంద్రాలకు ఉదయం 8.30 గంటలకే విద్యార్దులు కేంద్రాలకు చేరుకున్నారు. 9 గంటలకు విద్యార్దులను క్షుణ్ణంగా తనిఖీ చేసి పరీక్ష కేంద్రంలోకి పంపించారు. ఎటువంటి ఎలాక్ట్రానికి పరికరాలు లోపలికి అనుమతించ లేదు. విద్యార్దులు తోటి విద్యార్దులు, తల్లి తండ్రులు, ఉపాద్యాయులు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 144 అమల్లో ఉంది. కరకగూడెం ఎస్ఐ రాజేందర్ పరీక్ష కేంద్రం వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
Post Views: 52