గోదావరిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

గోల్డెన్ న్యూస్/ భద్రాద్రి కొత్తగూడెం : భద్రాచలం వద్ద గోదావరిలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి… భద్రాచలం గోదావరి నదిలో గుర్తుతెలియని మృతదేహం  కనిపించడంతో స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికి తీసేందుకు చర్యలు చేపట్టారు. మృతదేహంపై ఎరుపు రంగు టీ షర్టు ధరించి ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Facebook
WhatsApp
Twitter
Telegram