వన్యప్రాణులను వేటాడ బోయిన వ్యక్తి మృతి

గోల్డెన్ న్యూస్ /ములుగు : వన్యప్రాణులను వేటాడేందుకు ఉచ్చులు అమర్చబోయి పొరపాటున   అదేఉచ్చు తగిలి విద్యుదాఘాతానికి గురై ఒకరు మృతి చెందిన సంఘటన ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో చోటుచేసుకుంది. ఏటూరునాగారం ఎస్సై షేక్ తాజుద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఏటూరునాగారం పట్టణానికి చెందిన తుమ్మ గంగయ్య(55), ఎద్దు రమేష్, లొటపిటల లక్ష్మీనారాయణ అనే ముగ్గురు వేటగాళ్లు వన్యప్రాణులను వేటాడి వాటి మాంసాన్ని విక్రయించి సొమ్ము చేసుకోవాలనుకున్నారు. శుక్రవారం రాత్రి ఏటూరునాగారం మండలంలోని చిన్నబోయినపల్లి, షాపల్లి గ్రామాల మధ్యనున్న అడవిలో ఉచ్చులు అమర్చి వాటికి విద్యుతు కనెక్షన్ ఇచ్చారు. ప్రమాదవశాత్తు తుమ్మ గంగయ్య ఉచ్చుకు తగలడంతో.. విద్యుదాఘాతానికి గురై అక్కడే కుప్పకూలిపోయాడు. ఒళ్లంతా కాలిపోయి అపస్మారక స్థితికివెళ్లాడు. గమనించిన రమేష్, లక్ష్మీనారాయణ భయంతో అక్కడి నుంచి పారిపోయారు. గంగయ్య కాలిన గాయాలతోనే అడవిలో ఉన్నట్లు తెలుసుకున్న కుటుంబసభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ శ్రీనివాస్, ఎస్సై తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని ఉచ్చులను తొలగించారు గంగయ్య ప్రాణాలతో ఉండడంతో అడవి నుంచి స్ట్రెచర్ పై ఎటునాగారం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. అక్కడినుంచి మెరుగైన వైద్యం కోసం ఎంజీఎం కు తరలించగా పరీక్షించడం వైద్యం అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.

Facebook
WhatsApp
Twitter
Telegram