గోల్డెన్ న్యూస్/భద్రాద్రి కొత్తగూడెం : ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో ఆదివారం పోలీసుల ఎదుట 22 మంది మావోయిస్టులు లొంగిపోయారు. సీఆర్పీఎఫ్ డీఐజీ దేవేంద్ర సింగ్ నేగి, జిల్లా ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ తదితర ఉన్నతాధికారుల ఎదుట వీరు లొంగిపోయారు.వారిలో ‘ఏఓబీ ఆంధ్ర -ఒడిశా బోర్డర్’ డివిజన్ పార్టీ సభ్యులు,, తెలంగాణ రాష్ట్రపార్టీ కమిటీ ప్లాటు నెంబర్ 9, 10 సభ్యులు గంగలూరు, పామేడు, ఇరమగుండ రెవల్యూషనరీ పీపుల్స్ కమిటీ సభ్యులు ఉన్నారు. లొంగిపోయిన వారిలో ఆరుగురు మావోయిస్టులకు రూ .11 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ప్రభుత్వ పునరావాస పథకాన్ని సద్వినియోగం చేసుకొని మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకిలోకి వచ్చి కొత్త జీవితాన్ని గడపాలని ఎస్పీ జితేందర్ కుమార్ యాదవ్ కోరారు. ఈ సంవత్సరం ఇప్పటివరకు జిల్లాలో 107 మంది మావోయిస్టులు లొంగిపోగా, 143 మందిని అరెస్ట్ చేసినట్లు, 82 మంది మావోయిస్టులు వివిధ ఎన్కౌంటర్లో మృతి చెందినట్లుగా ఎస్పీ వెల్లడించారు.
