రోడ్డు సౌకర్యం లేక ఆంబోలెన్స్ రాక ఓ వ్యక్తిని చేతులపై మూడు కిలోమీటర్లు మోసుకెళ్లి ఆంబులెన్స్ ఎక్కించిన గ్రామస్తులు.
గోల్డెన్ న్యూస్ / వరంగల్ : నెక్కొండ మండలం సంగ్య తండాకు చెందిన మంగ్యా ఆదివారం ఉదయం కుటుంబ కలహాల నేపథ్యంలో క్షణికావేశంలో క్రిమి సంహారక మందు తాగాడు. గమనించిన గ్రామస్థులు 108కు సమాచారం అందించారు. ఆంబులెన్స్ రా వడానికి దారి లేకపోవడంతో బాధితుణ్ని మూడు కిలోమీటర్లు చేతుల మీదే ఎత్తుకొని వచ్చి అంబులెన్స్ ఎక్కించి నర్సంపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉందని గ్రామస్థులు తెలిపారు. గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని పలుమార్లు ప్రజా ప్రతినిధులు, అధికారులను కోరినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Post Views: 26