గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్ :ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థినులు నీటి కోసం ఆదివారం రాత్రి ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు. వర్సిటీలోని సెంటినరీ హాస్టల్లో నీరు లేదంటూ విద్యార్థినులు ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థినులు మాట్లాడుతూ తమకు సరిపడా నీరు అందించడం లేదని మండిపడ్డారు. దీనిపై అధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా..స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నూతన సెంటినరీ హాస్టల్ విద్యార్థినులకు కేటాయించినప్పటికీ మౌలిక వసతులు లేకుండా ఎలా ఉండాలని ప్రశ్నించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. కనీస అవసరాలకు కూడా నీళ్లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని తెలిపారు.
Post Views: 17