– ఐపీఎల్ సమయంలో వందలాది బెట్టింగ్ యాప్స్, సైట్స్..
– 100 శాతం గ్యారెంటీ రిటర్న్స్ పేరుతో యువతకు ఎర.
– యాప్‌ల బారిన పడి మోసపోతున్న యువత.
_ ఈ సీజన్లో కోట్ల రూపాయల వ్యాపారం.
గోల్డెన్ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం : యువత ఈజీ డబ్బులకు అలవాటు పడి బెట్టింగ్ లకు మొగ్గు చూపకూడదని,బెట్టింగ్ యాప్ లతో జాగ్రత్తగా ఉండాలని కరకగూడెం ఎస్ఐ రాజేందర్ అన్నారు. సోమవారం కరకగూడెం పిఎస్ లో యువతను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ప్రస్తుతం ఐపియల్ క్రికెట్ వెల విపరీతంగా డబ్బులు చేతులు మారుతున్నాయి ఎవరో ఒక్కరు బెట్టింగ్ లో డబ్బులు గెలుచుకున్నారు అనే వెర్రితనంతో మీరు అ వలలో చిక్కుకోవద్దని ఆయన సూచించారు. అలాగె బెట్టింగ్ యాప్స్,ఆన్లైన్ బెట్టింగ్ అడి ఎంతోమంది యువత ప్రణాలు పోగోట్టుకోవడం మనం చూస్తునే ఉన్నాం ఇటువంటి సంఘటనలు మన మండల పరిధిలో జరగకుండా చూడవలసిన భాద్యత మన అందిరిపై ఉందని ముఖ్యంగా యువత తల్లిదండ్రులు పై ఎక్కువగా ఉందని పిల్లల అవసరాలకు మించి డబ్బులు ఇవ్వకుడాదని అయన తెలిపారు.ఈ బెట్టింగ్ మహమ్మారి వలలో చిక్కుకోని ఎన్నో కుటుంబాలు రొడ్డున్న పడ్డాయని అయన గుర్తుచేశారు.
ఐపీఎల్ అత్యంత వైభవంగా ప్రారంభమయ్యింది. ఇండియాలో క్రికెట్‌కు ఉన్న క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడానికి అప్పుడే బెట్టింగ్ మాఫియా బరిలోకి దిగింది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ పద్దతుల్లో బెట్టింగ్‌ను ప్రోత్సహిస్తూ రూ.వేలాది కోట్లు ఈ రెండు నెలల్లో తమ ఖాతాల్లో వేసుకుంటాయి. ముఖ్యంగా క్రికెట్ పిచ్చి ఉన్న యువతను ఈ బెట్టింగ్ యాప్‌లు ఆఫర్ల పేరుతో ఆకర్షించి.. అప్పుల్లో మునిగి పోయేలా చేస్తున్నారు. బెట్టింగ్ యాప్‌లపై తెలంగాణ పోలీసులు ఇప్పటికే కేసులు నమోదు చేస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ కోసం ప్రచారం చేస్తున్న సినీ నటులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్లుయెన్సర్లపై కేసులు కూడా నమోదు చేశారు. కాగా, ఐపీఎల్ సమయంలో వందలాది బెట్టింగ్ యాస్స్, సైట్స్ పుట్టుకొని వస్తాయని.. వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఇలా దోచుకుంటారు..
పేరుకు క్రికెట్ బెట్టింగ్ యాప్సే అయినా.. ఇవి యూజర్ల పర్సనల్ డేటాను దొంగిలిస్తున్నాయి. దీని ద్వారా యూజర్ల ఫైనాన్షియల్ విషయాలను గమనించి.. సైబర్ ఫ్రాడ్‌కు పాల్పడిన సంఘటనలు కూడా ఉన్నాయి. మరోవైపు ఆఫర్లు, డిస్కౌంట్ల పేరుతో కొత్త యూజర్లను ఆకర్షిస్తాయి. ముందగానే రూ.100 నుంచి రూ.2000 వరకు క్యాష్ లోడ్ చేసి.. వాటిని వాడి బెట్టింగ్ చేయాలని ప్రోత్సహిస్తాయి. ఆ తర్వాత నెమ్మయదిగా యూజర్లతో డిపాజిట్ చేయించడం మొదలు పెడతాయి. మొదట్లో డబ్బులు వచ్చినట్లు కనపడినా.. ఆ తర్వాత యూజర్‌ను పూర్తిగా ముంచేస్తాయి. ఇలా రూ.లక్షల్లో నష్టపోతున్న వాళ్లు చాలా మంది ఉన్నారు. దేశవ్యాప్తంగా ఇల్లీగల్ బెట్టింగ్స్ నిర్వహిస్తూ రూ.వేలకోట్లను కొల్లగొడుతున్నాయి. డబ్బులు నష్టపోయిన వారు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి భయపడుతున్నారు. బెట్టింగ్‌లో నష్టపోయామని తెలిస్తే పరువు పోతుందని చాలా మంది సైలెంట్‌గా ఉండిపోతున్నారు. ఇదే ఆ ఇల్లీగల్ బెట్టింగ్ నిర్వాహకులకు కలిసి వస్తుందని పోలీసులు అంటున్నారు. ఒక వేళ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినా.. ఇతర దేశాల్లో ఉండే ఈ ముఠా సభ్యులను పట్టుకోవడం కష్టంగా మారుతుంది.
బెట్టింగ్ అనేది పూర్తిగా అక్రమం. అందుకే భారత ప్రభుత్వం ఈ బెట్టింగ్ యాప్స్‌ను పూర్తిగా నిషేధించింది. అయినా సరే యువత ఈ బెట్టింగ్ ఉచ్చులో చిక్కుకొని తీవ్రంగా నష్టపోతున్నారు. కాబట్టి వీటికి సాధ్యమైనంత దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఆటను చూసి ఎంజాయ్ చేయడం తప్పు లేదు. కానీ దానిపై బెట్టింగ్ వేయడమే తప్పని పోలీసులు హెచ్చరిస్తున్నారు.