6 గురు పేకాట రాయుళ్లు అరెస్ట్.

గోల్డెన్ న్యూస్ / కరకగూడెం :  కరకగూడెం మండలం బుర్దారం గ్రామం  సమీపంలోని నరసింహస్వామి ఆలయ సమీపంలో పేకాట ఆడుతున్న 6 మందిని కరకగూడెం పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడ పేకాట ఆడుతున్నారని సమాచారం రావడంతో కరకగూడెం ఎస్ఐ రాజేందర్ సిబ్బందితో కలిసి సోమవారం మధ్యాహ్నం దాడులు నిర్వహించారు. దాడిలో పేకాట ఆడుతున్న 6 మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ. 7,000 నగదు,2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు.

Facebook
WhatsApp
Twitter
Telegram