అంగన్వాడీ స్థాయిలో ప్రతి పిల్లవాడికి పోషకాహార లోపం నివారణ చర్యలను చేపట్టాలి.
గోల్డెన్ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం : భద్రాచలం మండలం, భద్రాచలంలోని AMC కాలనీలోని పల్లె దవాఖానలో సోమవారం ITC మిషన్ సునేహ్రా కల్, IGD NGO ల ఆధ్వర్యంలో ఫ్రంట్ లైన్ వర్కర్స్ (FLW) ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ DM&HO డాక్టర్ చైతన్య , మెడికల్ ఆఫీసర్ M. సుభాష్ , CDPO V. జ్యోతి , ANMలు, ఆశా కార్యకర్తలు, ITC మిషన్ సునేహ్రా కల్, IGD NGO నుండి జిల్లా ఇన్చార్జ్ M. అనిల్ కుమార్ గారు, ఫీల్డ్ ఇన్చార్జ్ స్వాతి, భరత్ పాల్గొన్నారు. ఈస మావేశంలో రక్తహీనత (అనీమియా), పోషకాహార లోపం నివారణపై సమగ్ర చర్చ జరిగింది. డాక్టర్ చైతన్య IGD NGO చేస్తున్న కార్యక్రమాలను ప్రశంసించారు. గ్రామీణ ప్రాంతాల్లో రక్తహీనత, పోషకాహార లోపం, ANC, PNC సంరక్షణలో ఆశా, అంగన్వాడీ కార్యకర్తల పాత్రను ప్రముఖంగా ప్రస్తావించారు. CDPO V. జ్యోతి , అంగన్వాడీ స్థాయిలో ప్రతి పిల్లవాడి స్క్రీనింగ్ ప్రాముఖ్యతను, పోషకాహార లోపం నివారణ చర్యలను వివరించారు. మెడికల్ ఆఫీసర్ M. సుభాష్ , పల్లె దవాఖానాల ప్రాముఖ్యతను తెలియజేస్తూ, SAM, MAM పిల్లల గుర్తింపు, NRCకి సిఫార్సు, పోషకాహార లోపం నివారణపై సూచనలు చేశారు.
IGD NGO తరపున అనిల్ కుమార్, సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమాలకు సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో రక్తహీనత స్క్రీనింగ్, పోషకాహార లోపం అవగాహన ప్రచారం, ఆశా, అంగన్వాడీ కార్యకర్తలతో ANC, PNC రక్తహీనత ఫాలో-అప్, పీర్ గ్రూపుల ఏర్పాటు వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పీర్ గ్రూపుల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించవచ్చని ఆయన పేర్కొన్నారు.