32 లక్షల మంది పేద ముస్లింలకు. పంపిణీ చేయనున్న బిజెపి
రంజాన్ పండగను పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా 32 లక్షల మంది పేద ముస్లింలకు నిత్యావసర వస్తువులతో కూడిన కిట్లను పంపిణీ చేయనుంది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేరుతో ఈ కిట్లకు సౌగత్-ఇ-మోదీ అని పేరు పెట్టారు.రేపు ఢిల్లీలో కిట్ల పంపిణీని ప్రారంభించనున్న బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా పురుషులు, స్త్రీలకు బట్టలు, సేమియా, ఖర్జూర, ఎండు ఫలాలు, చక్కెర ఇతర వస్తువులు ఉండనున్న కిట్లు ఈ నెల 31న ఈద్ జరుపుకునే అవకాశం ఉన్నందున.. ఆ రోజున దేశంలోని 32 లక్షల మంది పేద ముస్లిం కుటుంబాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేరుతో బహుమతులు అందజేస్తామని బీజేపీ మైనారిటీ వింగ్ జాతీయ అధ్యక్షుడు జమాల్ సిద్ధిఖీ తెలిపారు.
సౌగత్-ఎ-మోదీ..
జిల్లా స్థాయిలో సౌగత్-ఎ-మోదీ కిట్లను పంపిణీ చేయడంతో పాటు ఈద్ మిలన్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించనున్నట్లు బీజేపీ మైనారిటీ ఫ్రంట్ వెల్లడించింది. ఈ కిట్లను పంపిణీ చేయడానికి 32,000 మంది పార్టీ కార్యకర్తల సేవలను వినియోగించుకోనుంది బీజేపీ అధిష్ఠానం. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అనే సందేశాన్ని వ్యాప్తి చేయడంలో భాగంగా దీన్ని నిర్వహించనున్నట్లు జమాల్ సిద్ధిఖీ చెప్పారు