నిమిషాల వ్యవధిలోనే మూడు సార్లు కనిపించిన భూమి.
పేక మెడల్లా కూలిన భవంతులు.
బ్యాంకాక్: మయన్మార్, థాయ్లాండ్ ను శుక్రవారం రెండు భారీ భూకంపాలు వణికించిన సంగతి తెలిసిందే. ఈ భూప్రళయంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ ప్రకంపనల విధ్వంసానికి రెండు దేశాల్లో కలిపి మృతుల సంఖ్య 700 దాటింది. ఒక్క మయన్మార్లోనే కనీసం 694 మంది మరణించినట్లు మయన్మార్ మిలిటరీ అధికారులు వెల్లడించారు. అటు బ్యాంకాక్లో 10 మంది మరణించగా.. ఓ భారీ భవంతి కూలిన ఘటనలో దాదాపు 100 మంది నిర్మాణ కార్మికులు గల్లంతయ్యారు. ఈ విపత్తు కారణంగా మృతుల సంఖ్య 10వేలు దాటే అవకాశం ఉందని అమెరికా ఏజెన్సీ హెచ్చరించడం గమనార్హం.
Post Views: 55