ఛత్తీస్గఢ్ మరోసారి భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది.
సుక్మా : చత్తీస్గడ్ రాష్ట్రం సుక్మా జిల్లా దండకాణ్యంలో శనివారం ఉదయం భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఛత్తీస్గఢ్లోని భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 16 మంది మావోయిస్టులు మృతి చెందారు..
స్థానిక గోగుండా కొండపై మావోయిస్టుల కదలికలు ఉన్నాయన్న సమాచారంతో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో మావోయిస్టులు కాల్పులకు దిగారు. ఎదురుకాల్పులు జరిపిన పోలీసులు 16 మందిని హతమార్చారు. కెర్లపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కాల్పులు జరిగినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, బలగాలు ఈ ఆపరేషన్లో పాల్గొన్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఇరువర్గాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Post Views: 31