ఘనంగా టిడిపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

గోల్డెన్ న్యూస్ / కరకగూడెం : కొరకగూడెం మండలం కేంద్రంలో  తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు సిరిశెట్టి కమలాకర్  జెండా ఆవిష్కరించి, పార్టీ స్థాపన నాటి నుండి నేటి వరకు జరిగిన పరిణామాలను గుర్తు చేశారు. ఎన్టీఆర్ కు జోహార్లు అంటూ నినాదాలు చేశారు. ఈ ఆవిర్భావ వేడుకలలో ఆయా గ్రామాల తెదేపా నాయకులు,  గ్రామాలలో సర్పంచులు జెండాలు ఎగరేసి, ఎన్టీఆర్ విగ్రహాలకు పూలను మాలలు వేసి, నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో. జిల్లా నాయకులు పాయం లక్ష్మీనారాయణ. చందా రాఘవులు. పార్లమెంట్ ఎస్టి సెల్ అధ్యక్షులు వీసం సత్యనారాయణ. గుండ్ల కళ్యాణ్. సిరిశెట్టి సాయి తేజ మరియు తదితరులు పాలొగొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram