ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కు ఘన స్వాగతం పలికిన ప్రజలు..
గోల్డెన్ న్యూస్/ కరకగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం గొల్లగూడెం గ్రామంలో 20 లక్షల అంచనాతో వ్యయంతో నూతనంగా నిర్మించిన గొల్లగూడెం గ్రామపంచాయితీ కార్యాలయాన్ని పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు గురువారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంచాయతీ కార్యాలయం కోసం భవనం నిర్మించినందుకు ఆనందంగా ఉందన్నారు. పంచాయతీలోని అన్ని సమస్యలను పరిష్కరిస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట కట్టుబడి ఉందని ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు. అధికారులు ఎల్లప్పుడు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలన్నారు. అనంతరం ప్రభుత్వ అధికారులతో గ్రామస్తుల సమక్షంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించి పలు సమస్యలు ఆయన దృష్టికి రాగా వాటిని త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ నాగప్రసాద్, ఇంచార్జ్ ఎంపీడిఓ కుమార్, ఏడుళ్ళ బయ్యారం సిఐ వెంకటేశ్వర్లు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్, ఎర్ర సురేష్, పోలెబోయిన తిరుపతయ్య ,శ్రీవాణి, జలగం కృష్ణ, మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
,
Post Views: 36