కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

గోల్డెన్ న్యూస్/ కరకగూడెం : పేదింటి ఆడపిల్లలకు కళ్యాణ లక్ష్మి పథకం వరం అని పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం గొల్లగూడెం గ్రామంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 29 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేదింటి ఆడపిల్లలకు ఆర్థికంగా ఆదుకుంటున్నదని అన్నారు. నియోజకవర్గంలోని సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నానని తెలిపారు.

Facebook
WhatsApp
Twitter
Telegram