గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సందర్భంగా ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పాటను విడుదల చేశారు. మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పాట రచించి పాడారు. ‘బండెనుక బండి కట్టి… పోదాము రారన్నో…” అంటూ రసమయి బాలకిషన్ రాసి, పాడిన పాటను కేసీఆర్ ఆవిష్కరించారు. పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటివరకు భారాస ప్రస్థానంపై పాటలు, కళారూపాలు రూపొందించాలని రసమయి బాలకిషన్కు కేసీఆర్ సూచించారు. కార్యక్రమంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు, ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఇతర నాయకులు పాల్గొన్నారు.
Post Views: 25