వర్షాకాలం కోతకు గురైన చిరుమళ్ళ బ్రిడ్జి, రోడ్ల మరమ్మతులు చేపట్టాలి – వర్షాకాలం వరద గండంతో కోతకు గురవుతున్న స్పందించని ప్రభుత్వం – రెండు నెలల్లో వర్షాకాలం ప్రారంభమవుతున్న – ప్రారంభం కాని పనులు వెంటనే బ్రిడ్జి పనులు ప్రారంభించాలి…
– సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు నిమ్మల వెంకన్న
గోల్డెన్ న్యూస్ / కరకగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం చిరుమల్ల బ్రిడ్జి పటిష్టతపై నిర్లక్ష్యం తగదని వర్షాకాలం మొత్తం వరద గండంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మరో రెండు నెలల్లో వర్షాకాలం ప్రారంభమవుతున్న నేటికీ పనులు ప్రారంభించ లేదని వెంటనే బ్రిడ్జి పనులు ప్రారంభించాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు నిమ్మల వెంకన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఆ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో కోతకు గురైన బ్రిడ్జినీ సందర్శించారు అనంతరం వారు మాట్లాడుతూ.. బ్రిడ్జికి వరద తాకిడి లేకుండా కరకట్ట నిర్మాణం చేయాలని బ్రిడ్జి కోతకు గురైన ప్రాంతంలో పటిష్టం పరిచేలా తక్షణమే నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వం ఇంతవరకు పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. గత వర్షాకాలంలోనే వర్షాలు పడుతున్న కొద్ది మట్టి కొట్టుకుపోయి తెగిపోతుంటే కొత్తగా మట్టి ఇసుక బస్తాలు పోసి చేతులు దులుపుకున్నారే తప్ప ముందు చూపుగా ఎండాకాలంలో లోనే పనులు ప్రారంభించి వర్షాకాలంలోపు పనులు పూర్తి చేసి ముగించాలనే ముందుచూపు లేదని ప్రజల గోడును పట్టించుకునే నాధుడు కరువయ్యారని వారు ఆవేదన వ్యక్తం చేశారు అదే కాకుండా మండలంలోని బంగారుగూడెం సమీపంలోని బ్రిడ్జి, సమత్ బట్టుపల్లి పంచాయితీ బూడిద వాగు బ్రిడ్జిలు వర్షాకాలం వరదలకు కోతకు గురయ్యాయని వీటిపట్ల ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వ్యక్తం చేస్తుందని వాటి మరమ్మత్తుల ఊసే ఎత్తడం లేదని వారన్నారు ఎన్నికలలో కల్లబొల్లి మాటలు చెప్పి ఓట్లు దండుకున్న నాయకులు ఈ రోజు ఎక్కడికి వెళ్లారని వారు దుయ్యబట్టారు తక్షణమే బ్రిడ్జి పనులను ప్రారంభించకుంటే ఆయా గ్రామాల ప్రజలను సమీకరించి ఆందోళన నిర్వహిస్తామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కన్వీనర్ కొమరం కాంతారావు మండల కమిటీ సభ్యులు సర్ప సత్యం కొమరం మల్లక్క పదం బాబురావు నరసింహారావు పద్దం గణేష్ లక్ష్మయ్య ఉంగయ్య సతీష్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.