2 భాగాలుగా విడిపోయిన ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్.. తప్పిన పెను ప్రమాదం

పలాసలో.. సమీపంలో ఘటన.

గోల్డెన్ న్యూస్ / శ్రీకాకుళం : పలాస సమీపంలో ఫలక్‌నామా ఎక్స్‌ప్రెస్ బోగీలు విడిపోవటంతో… ప్రయాణికులు కంగారెత్తారు. సుమారు గంట పాటు ఆందోళన చెందారు. ఒక రకంగా మంగళవారం భారీ ప్రమాదం తప్పింది. వేగంగా ఫలక్ నుమా ఎక్స్ప్రెస్ దూసుకు పోతుంటే.. అకస్మాత్తుగా . ట్రెయిన్ నుంచి బోగీలు విడిపోయాయి. ఇంజన్తో కొన్ని బోగీలు వెళ్లిపోతే.. మరి కొన్ని బోగీలు విడిపోయాయి. ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి సికింద్రాబాద్ నుంచి హౌరా ఫలక్ నుమా ఎక్స్ప్రెస్ మందస-సున్నాదేవి మధ్యలోకి చేరే సరికి బోగీలు విడిపోయాయి. ఈ విషయం తెలియడంతో వెంటనే రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. 8వ బోగీ వద్ద ప్రమాదం జరగ్గా.. 15 బోగీలు ఇంజనుతో సహా వెల్లిపోయాయి. ఘటన స్థలానికి రైల్వే సిబ్బంది చేరుకుంది. విడిపోయిన భోగీలను ట్రెయిన్ కు అమర్చారు. ఈ ఘటనలపై రైల్వే అధికారులు విచారణ చేపట్టారు.

Facebook
WhatsApp
Twitter
Telegram