ఏసీబీకి పట్టుబడ్డ కమ్యూనిటీ కోఆర్డినేటర్

గోల్డెన్ న్యూస్ / జమ్మికుంట : జమ్మికుంట గ్రామీణ పేదరిక నిర్మూలనసంస్థ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. పెద్దంపల్లి ఐకేపీ వీఏవో దొడ్డే స్పప్న గౌరవ వేతనానికి సంబంధించిన డబ్బుల విషయమై కమ్యూనిటీ కోఆర్డినేటర్ (గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ) పసల గొండ సురేశ్ రూ. 20వేలు లంచం డిమాండ్ చేయగా.. ఆమె ఏసీబీ అధికారులను సంప్రదించారు. బాధితురాలి నుంచి మంగళవారం రూ. 10వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారు పట్టుకున్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram