ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు.గాంధారి మండల కేంద్రంలో ఘటన
గోల్డెన్ న్యూస్ /గాంధారి : ప్రయాణిస్తున్న కారుకు గుర్తుతెలియని జంతువు అడ్డురావడంతో కారు అదుపు తప్పి ఒకరు మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారు. ఈఘటన కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో బుధవారం తెల్లవారుజామున జరిగింది. వివరాల్లోకి వెళ్తే… గాంధారి మండలం చిన్నగుట్ట తండా చెందిన కృష్ణ, మౌనిక దంపతులతో పాటు వారి కోడలు బాదవత్ పూజ (22), కృష్ణ సోదరి శిల్పలు హైదరాబాద్ లో షాపింగ్ కు వెళ్లారు. పనులు ముగించుకుని మంగళవారం రాత్రి గాంధారికి వస్తున్నారు. ఈక్రమంలో గాంధారి హిందుస్థాన్ పెట్రోల్ బంక్ వద్ద బుధవారం ఉదయం మూడు గంటల ప్రాంతంలో గుర్తుతెలియని జంతువు అడ్డురావడంతో కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న బాదవత్ పూజ (22) అక్కడికక్కడే మృతి చెందింది. కారులో ఉన్న శివకృష్ణ, శిల్ప లకు గాయాలు అయ్యాయి .కాగా మౌనికకు తీవ్ర గాయమైందని కుటుంబ సభ్యులు తెలిపారు. గాయపడిన ముగ్గురిని ముందుగా గాంధారి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా.. మెరుగైన చికిత్స నిమిత్తం కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గాంధారి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.