గోల్డెన్ న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం : అశ్వరావుపేట మండలంలోని మారుమూల గిరిజన గ్రామం కంట్లం సమీపంలో కొందరు వ్యక్తులు నాటు తుపాకులతో బుధవారం తెల్లవారుజామున సంచరించడంతో స్థానిక గిరిజనులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ విషయాన్ని అధికారులకు తెలపడంతో ఒకరు దొరకగా. మిగిలినవారు పరారయ్యారు. అదుపులో ఉన్న వ్యక్తి ఆంధ్రప్రదేశ్ వాసిగా అధికారులు గుర్తించారు. ఎనిమిది మంది వ్యక్తులు ఆరు తుపాకులతో సంచరించినట్లు గిరిజనులు అధికారులకు తెలిపారు. అడవి జంతువులను వేటాడేందుకు ఆంధ్రాకు చెందిన వ్యక్తులు వచ్చి ఉంటారని అధికారులు భావిస్తున్నారు.
Post Views: 16