తైవాన్‌లో భూకంపం.

రిక్టర్‌ స్కేల్‌పై 5.0 తీవ్రతతో ప్రకంపనలు..!

గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్: వరుస భూకంపాలు తైవాన్‌ను వణికించాయి. దాంతో రాజధాని తైపీ సిటీలో భయానక వాతావ రణం నెలకొన్నది. రిక్టర్‌ స్కేల్‌పై 5..0 తీవ్రతతో భూకంపం సంభవించిన ట్లుగా ఆ దేశ వాతావరణ శాఖ పేర్కొంది.

 

భూకంపంతో తైపీలో కొద్ది సెకన్ల పాటు భూమి కంపించగా.. జనమంతా భవనాల నుంచి బయటకు పరుగులు తీశారు. రిక్టర్‌ స్కేల్‌పై 5 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయని యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం తెలిపింది.

 

ఈశాన్య తీరంలోని యిలాన్‌కు ఆగ్నేయంగా 21 కిలోమీటర్లు దూరం.. భూమికి 69 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం గుర్తించినట్లు పేర్కొంది. ఈ నెల ఈ నెల 3, 4 తేదీల్లోనూ భూకంపాలు వచ్చిన విషయం తెలిసిందే.

 

మార్చి 28న థాయిలాండ్, మయన్మార్‌లో భారీ భూకం పం విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ విషాద ఘటనలో వేలాది మంది మృతి చెందాడు. 7.7 తీవ్రతతో వచ్చిన భూకంపం తీవ్ర నష్టాన్ని కలిగించింది. అనేక ప్రాంతాల్లో విద్యుత్, టెలిఫోన్ సేవలకు అంతరా యం కలిగించింది. రోడ్లు, వంతెనలు దెబ్బతిన్నాయి.

 

భూకంపంలో మరణించిన వారి సంఖ్య 3,600 కు చేరిందని.. 5,017 మంది గాయపడ్డారని సైనిక ప్రభుత్వ ప్రతినిధి మేజర్ జనరల్ జా మిన్ తున్ తెలిపారు. 160 మంది గల్లంతయ్యారు. 20 దేశాల నుంచి 1,738 మంది సిబ్బంది సహాయక చర్యల్లో మాకు సహాయం చేస్తున్నారని మయన్మార్‌ తెలిపింది. 653 మంది ప్రాణాలతో బయటపడిన వారిని గుర్తించి సహాయం అందించేందుకు సిబ్బంది సహకారం అందించార న్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram