గోల్డెన్ న్యూస్ /అశ్వాపురం : మండల పరిధిలోని ఆనందపురం గ్రామంలో ఎమ్మెల్యే పాయంవెంకటేశ్వర్లు బుధవారం లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తోందన్నారు. ప్రజలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం అశ్వాపురంలోని తహసీల్దారు కార్యాలయంలో కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఓరుగంటి బిక్షమయ్య, మండల అధికారులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 15