ఎక్కడైనా నల్లాల నుంచి నీళ్లు వస్తాయి..
కానీ అక్కడ భగీరథ నీటిలో చేప పిల్లలు వస్తున్నాయి..
ఆ నీటిని తాగేదెలా ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
గోల్డెన్ న్యూస్ /మణుగూరు : ఎక్కడైనా నల్లాల నుంచి నీళ్లు వస్తాయి. కానీ మణుగూరు ఓ కాలనీలో నల్లాల నుంచి చేప పిల్లలు ప్రత్యక్షమయ్యాయి. నమ్మశక్యంగా లేకున్నా ఇదే నిజం..మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని సుందరయ్య నగర్ తాగునీటిలో చాప పిల్ల దర్శనం ఇచ్చాయి .ఉదయం మిషన్ భగీరథ నీళ్లు సరఫరా అయ్యాయి. ఆ వార్డులో మహిళల మిషన్ భగీరథ నీళ్లు పట్టుకోవడానికి వచ్చిన మహిళలకు బిందెలో చేప పిల్లలు ప్రతేక్షమవ్వగా,మహిళలు ఆశ్చర్యపోయారు.గమనించిన మహిళ ఈ నీళ్లు తాగుతే రోగాల బారిన పడుతమని అక్కడి నుండి వెళ్ళిపోయారు. అధికారులు గోదావరి వాటర్ ని అసలు శుద్ధి చేస్తున్నారా లేదా ? ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు . అంతేకాకుండా నీళ్ల నుంచి దుర్వాసన కూడా వస్తుందని వారు ఆరోపిస్తున్నారు. స్వచ్ఛమైన నీటిని సరఫరా చేయాలని కోరుతున్నారు. ఇదిలా ఉంటే ఫిల్టర్ హౌస్‌లో ఫిల్టర్ కాకుండానే నీటిని వదులుతున్నట్లుగా పలువురు ఆరోపిస్తున్నారు..