భద్రాచలం పోలీస్ స్టేషన్లో ఏసీబీ దాడులు

సాక్షాలతొ దొరికిపోయిన, సీఐ, గన్ మెన్

గోల్డెన్ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం పట్టణ పోలీస్ స్టేషన్ లో గురువారం ఏసీబీ అధికారుల దాడులు నిర్వహించి, సీఐ గన్ మెన్ రామారావును అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు. విచారిస్తున్న ఏసీబీ డీఎస్పీ రమేష్ బృందం….

భద్రాచలం పోలీస్టేషన్లో సీఐ గన్మెన్ గా విధులు నిర్వహిస్తున్న రామారావును ఏసీబీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. గ్రావెల్ తరలిస్తున్న లారీని మార్చి 19 న పట్టుకుని వదిలేందుకు రు. 30 వేలు డిమాండ్ చేసి, రు.20 వేలు ఇచ్చే విధంగా మాట్లాడుకుని ఒక ప్రైవేటు వ్యక్తి ఖాతా లోకి నగదు బదిలీ చేయించుకున్నట్లు తెలిసింది. ఈ కేసు విషయంలో రామారావు తో పాటు, సీఐ రమేష్, మరో ప్రైవేటు వ్యక్తిని ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఆ డబ్బులు సీఐ కోసం తీసుకున్నాడా..? లేక ఇంకా వేరే వారికి ఇవ్వడానికి తీసుకున్నాడా..? అనే విషయం పై ఏసీబీ ఏసీబీ అధికారులు  దర్యాప్తు జరుపుతున్నారు..

Facebook
WhatsApp
Twitter
Telegram