సైబ‌ర్ నేరాల‌పై అప్ర‌మ‌త్తంగా ఉండాలి

సైబ‌ర్ నేరాల‌పై అప్ర‌మ‌త్తంగా ఉండాలి.. ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించిన పోలీసులు .. ఆన్‌లైన్ గేమ్స్, బెట్టింగ్ యాప్స్ వంటి సైబన్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని కరకగూడెం పోలీసులు సూచించారు.

గోల్డెన్ న్యూస్ /కరకగూడెం : పోలీసుల ఆధ్వర్యంలో సైబర్ నేరాలు, డ్రగ్స్, కొత్త చట్టాలపై అవగాహన కార్యక్రమం  మండలంలోని మోత శివారులో కరకగూడెం ఎస్ఐ  రాజేందర్ ఆదేశాల మేరకు హెడ్ కానిస్టేబుల్ సంపత్ ఆధ్వర్యంలో గురువారం అవగాహన కార్యక్రమం  నిర్వహించారు.ఈ సందర్భంగా హెడ్ కానిస్టేబుల్ సంపత్ మాట్లాడుతూ.. తెలియని నెంబర్ల నుంచి ఎవరైనా ఫోన్ చేసి ఓటిపిలు అడిగితే చెప్పొద్దని మొబైల్ ఫోన్ కి వచ్చే వెబ్సైట్ లింకులు ఓపెన్ చేయకూడదన్నారు. దానివల్ల నగదు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. సోషల్ మీడియాలో వచ్చే వీడియోలు చూసి ఉచితంగా డబ్బు వస్తుందని ఆశపడి మోసగాళ్ల ఉచ్చులో పడకూడదన్నారు. ఎవరైనా పొరపాటున సైబర్ నేరాల బారిన పడి డబ్బు కోల్పోతే వెంటనే సైబర్ క్రైమ్స్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 కాల్ చేసి కంప్లైంట్ చేయాలన్నారు. లేదా పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరు సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. సైబర్ మోసాల గురించి మీ స్నేహితులకు, బంధువులకు కూడా తెలపాలన్నారు. యువత తెలియకుండా గంజాయి వంటి మత్తు పదార్థాలు జోలికి వెళ్ళొద్దన్నారు. ఎవరైనా గంజాయి విక్రయిస్తే పోలీసువారికి సమాచారం అందించాలన్నారు. గంజాయి వంటి మత్తు పదార్థాల బారిన పడితే జీవితాలు నాశనం అయిపోతాయన్నారు. ఎవరైనా గంజాయి తీసుకున్నట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Facebook
WhatsApp
Twitter
Telegram