మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణం కోసం పింగిళి కళాశాల ఎన్సిసి క్యాడేట్లు ఎల్లప్పుడూ సిద్ధం ఉండాలి!

కల్నల్. రవీంద్ర కుమార్ రవి కమాండింగ్ అధికారి.

గోల్డెన్ న్యూస్ /హనుమకొండ : పింగిళి ప్రభుత్వ మహిళా (ఆటోనోమస్) హనుమకొండలో  గురువారం మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణం కోసం కళాశాలలో ప్రిన్సిపల్ లెఫ్టినెంట్ ప్రొఫెసర్ బత్తిని చంద్రమౌళి అధ్యక్షతన, కళాశాల ఏన్సీసీ ఆధ్వర్యంలో అవగాహన సమావేశం నిర్వహించబడింది అని ప్రిన్సిపల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి 8(టీ)వ బెటాలియన్ కమాండర్ ఆఫీసర్ కల్నల్ రవీంద్ర కుమార్ రవి ముఖ్యఅతిథి* గా మరియు *అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మేజర్ రేవతి ప్రభాకరన్ గౌరవ అతిథి* గా పాల్గొనడం జరిగింది.

ఈ సందర్భంగా కల్నల్ రవీంద్ర కుమార్ రవి మాట్లాడుతూ ఈ సమాజంలో ప్రస్తుత యువతను తీవ్రంగా పట్టిపీడిస్తున్న సమస్య మాదకద్రవ్యాల సమస్య అని చెప్పారు. మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి ఎన్సిసి క్యాడేట్స్ యొక్క పాత్ర ఎంతగానో ఉందని తెలిపారు కావున ఎన్సిసి క్యాడేట్లు సమాజంలో జరుగుతున్న యువత కొత్త పోకడలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అనుమానాస్పద పరిస్థితులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లాల్సిందని కోరారు ఈ సందర్భంగా *సే నో టు డ్రగ్స్ ప్రచార పోస్టర్ను విడుదల చేశారు.

అదేవిధంగా కళాశాలలో ఎన్సిసి మూడు సంవత్సరాల శిక్షణ పూర్తి చేసుకుని బయటకు వెళుతున్న కాడేట్స్ శుభభినందనలు తెలుపుతూ ఎన్సిసి సి సర్టిఫికెట్ పొందిన సీనియర్ క్యాడేట్స్ అందరికీ ఎన్సిసి బి మరియు సి సర్టిఫికెట్ల ద్వారా వచ్చే ఆర్మీ,కేంద్ర ప్రభుత్వ,రైల్వే డిపార్ట్మెంట్లో మరియు ఇతర రాష్ట్ర ప్రభుత్వఉద్యోగ అవకాశాల గురించి క్యాడేట్లకు వివరించారు.

ఈ సందర్భంలో మేజర్ రేవతి ప్రభాకరన్ మాట్లాడుతూ పింగిళి కళాశాల ఎన్సిసి క్యాడేట్లు మిగతా క్యాడేట్ల కన్నా శిక్షణలో ఎంతో ముందున్నారని మెరుగైన ప్రతిభ కనబరిచారని కళాశాల అందిస్తున్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అమ్మాయిలు స్వశక్తితో ఎదగాలని సూచించారు. విద్యార్థులను ఉద్దేశించి వారి ప్రతిభ పట్ల ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ కళాశాల ప్రిన్సిపల్ చంద్రమౌలి మాట్లాడుతూ కళాశాల లో ఎన్సిసి ప్రారంభించిన మూడు సంవత్సరాలలో మహిళ ఎన్సిసి క్యాడేట్లు ఎంతో శిక్షణ పొంది అన్ని రంగాలలో ముందుండి కళాశాలకు పేరు ప్రతిష్టలను తీసుకువస్తున్నారని ఇకముందు కూడా సమాజ నిర్మాణం కొరకు ముందుండాలని కోరారు. కళాశాల ఏంటి డ్రగ్ కమిటీ కన్వీనర్, కళాశాల ఎన్సిసి కేర్ టేకర్ డాక్టర్ బండారి సువర్ణ మాట్లాడుతూ కళాశాలలో ఎన్సిసి ప్రారంభించినప్పటినుంచి ఇప్పటివరకు జరిగిన అన్ని శిక్షణ మరియు క్యాంపు వివరాలను తెలిపారు. ఎన్సిసి క్యాడేట్ల సహాయంతో నేటి ఆధునిక పోకడలు ఉన్న ఈ సమాజంలోని యువతను పట్టిపీడిస్తున్న మాదకద్రవ్య సమస్యను నిర్మూలించడంలో తోడ్పాటు అందిస్తామని తెలిపారు. ఇందుకుగాను కళాశాల విద్యార్థినీలు అందరినీ కలుపుకొని మాదక ద్రవ్యాల నిర్మూలనకోసం ప్రజలను, యువతను చైతన్య పరుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సుహాసిని, ఐక్వఏసి కోఆర్డినేటర్ డాక్టర్ సురేష్ బాబు, డాక్టర్ రేణుక, డాక్టర్ కల్పన, పి.డి సుజాత ,రమేష్ ,రఫీ ,వినయ్, ఎన్సిసి సీనియర్ అండర్ ఆఫీసర్ అవంతి,జూనియర్ ఆఫీసర్ అవంతి, దివ్యశ్రీ మరియు అందరూ ఎన్సిసి క్యాడెట్లు పాల్గొనడం జరిగింది.

Facebook
WhatsApp
Twitter
Telegram