గోల్డెన్ న్యూస్ / జనగామ : దేవరుప్పుల మండలంలోని రామచంద్రపురం గ్రామంలో నిన్న సాయంత్రం వచ్చిన గాలివానతో, అకాల వర్షాలు రావడంతో రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన మొక్కజొన్న పంట పూర్తిగా నేలమట్టమైపోయింది. కంటికి కాయలు కనిపిస్తున్న స్థితిలో ఉన్న పంట ఒకే సారి పూర్తిగా తుడిచి పెట్టక పోయింది.
ఈ పరిణామంతో గ్రామంలోని రైతులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. పంట చేతికి వచ్చేటప్పుడు ఇలాగే ముంచెత్తితే ఎలా అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు చేసి సాగు చేసిన తమ ఆశలు ఒక్కసారిగా ఆవిరైపోయాయంటూ వారు కన్నీరు మున్నీరవుతున్నారు.
రైతుల ఆశలు తలకిందులైన ఈ నేపథ్యంలో, వారు అధికారులను క్షేత్రస్థాయిలో పరిశీలన చేయించాలని, నష్టాన్ని అంచనా వేసి తగిన పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి విపత్తులను తట్టుకోడానికి సరైన చర్యలు తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వం తరఫున తక్షణ చర్యలు తీసుకుని బాధిత రైతులకు న్యాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.