ఏపీలో రేపే ఇంటర్ ఫలితాలు.

గోల్డెన్ న్యూస్ / అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్ పరీక్షల ఫలితాలు రేపు శనివారం విడుదల కనున్నాయి. శనివారం ఉదయం 11గంటలకు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు.

 

విద్యార్థులు తమ ఫలితాలను resultsbie. ap.gov.inలో ఆన్‌లైన్‌లో తెలుసుకోవచ్చునని తెలిపారు. అదేవిధంగా ఈసారి ఫలితాలు మన మిత్ర వాట్సాప్ నవంబర్ 9552300009 ద్వారా కూడా వెల్లడించడం జరుగుతుందని చెప్పారు.

 

వాట్సాప్ నెంబర్ కు “హాయ్” సందేశాన్ని పంపడం ద్వారా ఫలితా లను తెలుసుకోవచ్చునని నారా లోకేశ్ తెలిపారు. ఈ సందర్భంగా ఇంటర్ ప్రథ మ, ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసిన విద్యార్థులకు లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు.

 

మీ కృషి రేపటి ఫలితాల్లో ప్రతిబింబించాలి.. ఉజ్వల భవిష్యత్తుకు తలుపులు తెరవాలని ఆకాంక్షిస్తున్న తెలిపారు.ఏపీలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు మార్చి 1 నుంచి 19వ తేదీ వరకు జరగ్గా.. ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు మార్చి 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరిగాయి.

Facebook
WhatsApp
Twitter
Telegram