ఘనంగా జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు

గోల్డెన్ న్యూస్ / కరకగూడెం : జ్యోతిరావు పూలే 190 జయంతి కార్యక్రమం సీపిఎం పార్టీ ఆధ్వర్యంలో అశ్వాపురంపాడు గ్రామంలొ ఉపాధి పని ప్రదేశంలో జరిగింది ముందు పూలే చిత్రపటానికి సిపిఎం నాయకులు పూలమాలలు వేశారు అనంతరం ఈ సభను ఉద్దేశించి సిపిఎం మండల కన్వీనర్ కొమరం కాంతారావు మాట్లాడారు జ్యోతిరావు పూలే జయంతి సభ జరుపుకోవాలని చాలా ఆనందంగా ఉందని ఆయన అన్నారు జ్యోతిరావు పూలే అందరికీ ప్రాథమిక విద్య ఉండాలని ఆనాడు అనేక పోరాటాల నిర్వహించారని ఆయన అన్నారు జ్యోతిరావు పూలే తన భార్య అయిన సావిత్రి బాయి పూలే కు తన ఇంటి వద్దనే చదువు నేర్పించి మహిళలకు విద్యా అవసరం అని చాటి చెప్పారు ఆనాడు బ్రాహ్మణులు మాత్రమే చదువుకోవాలని శూద్రులకు చదువు అవసరం లేదనే నిబంధనలను దోచుకొచ్చి ప్రతి ఒక్కరికి చదువు అవసరం అని పోరాడిన వారిలో మొదటి వ్యక్తి జ్యోతిరావు పూలే అని ఆయన కొనియాడారు జ్యోతిరావు పూలే ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు చదువుకోవాలని చదువు యొక్క ప్రాధాన్యతను చాటి చెప్పిన మహా వ్యక్తిని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు మంగయ్య, అడమయ్య, భద్రయ్య, ఉంగయ్య ,సిద్దు, దేవయ్య తదితరులు పాల్గొన్నారు

Facebook
WhatsApp
Twitter
Telegram