భారీగా గంజాయి పట్టివేత

రూ .3 కోట్ల 63 లక్షల రూపాయల విలువ గల గంజాయి పట్టివేత.

గోల్డెన్ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం : విశ్వసనీయ సమాచారం మేరకు కొత్తగూడెం 1 వ పట్టణ పోలీసులుస్టేషన్ పరిధిలోని శేషగిరినగర్ వద్ద  శనివారం నిర్వహించిన వాహన నిర్వహిస్తుండగా  UP82AT9894 అను నంబరు గల  లారీ లో 727.360 కిలోల  నిషేదిత గంజాయిని గుర్తించారు. సుమారుగా 3,63,68,000/- రూపాయల విలువ గల ఇట్టి గంజాయిని పోలీసులు స్వాదీనం చేసుకొని, లారీలో ఉన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. శివమ్ గుప్తా, (40 ), రియల్ ఎస్టేట్ వ్యాపారి, R/o.జగదీష్ఫుర, బోదలా PS, ఆగ్రా జిల్లా, ఉత్తరప్రదేశ్ అను వ్యక్తి ఈ రోజు పట్టుబడిన లారీ డ్రైవర్ భూరి సింగ్ S/O. డాక్ సింగ్, (38), నాగుల బుద్ధ గ్రామం, ఆగ్రా జిల్లా, ఉత్తరప్రదేశ్ మరియు రవి కుమార్, S/O.కమల్ సింగ్,( 33), భోగిపురం గ్రామం, ఆగ్రా జిల్లా, ఉత్తరప్రదేశ్ అను ఇద్దరు వ్యక్తులకు గత నెల 8 తేదీ  నగదును ఇచ్చి ASR జిల్లా, చింతూరు మండలంలోని తులసిపాక గ్రామ అటవీ ప్రాంతంలో నిషేదిత గంజాయిని లోడ్ చేసుకొని రావాల్సిందిగా చెప్పి పంపినాడు.10.వ తేదీన వీరిరువురు తులసిపాక చేరుకుని అక్కడ ఏడుగురి వద్ద నుండి 727.360 కేజీల గంజాయిని లారీ క్యాబిన్ కు మరియు ట్రక్ నకు మధ్య భాగంలో ఎవరికీ కనపడకుండా ఒక చాంబర్ లాగా తయారు చేసి అందులో అమర్చుకుని తిరిగి భద్రాచలం, ఖమ్మం, హైదరాబాద్ మీదుగా ఆగ్రాకు గంజాయిని తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారంతో శనివారం కొత్తగూడెం వన్దాన్ మరియు సిసిఎస్ పోలీసులు వీరిని పట్టుకోవడం జరిగింది. ఇట్టి నిషేధిత గంజాయిని అమ్మిన వ్యక్తులపైన, కొనుగోలు చేసిన వ్యక్తులు మరియు రవాణా చేస్తున్న వ్యక్తులందరిపై కేసు నమోదు చేసి, రవాణాకు ఉపయోగించిన లారీను మరియు మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేయడం జరిగినది. పట్టుబడిన ఇద్దరు వ్యక్తుల వివరాలు A1). భూరి సింగ్ S/o.డాక్ సింగ్, 38yrs, నాగుల బుద్ధ గ్రామం, మల్ పురా PS, ఆగ్రా జిల్లా, ఉత్తరప్రదేశ్ A2).రవి కుమార్, S/O. కమల్ సింగ్, 33yrs, భోగిపురం గ్రామం, షాగంగా PS, ఆగ్రా జిల్లా, ఉత్తరప్రదేశ్. కొనుగోలు చేసిన వ్యక్తి A3). శివమ్ గుప్తా, R/o. జగదీష్ఫుర, ఆగ్రా జిల్లా, ఉత్తరప్రదేశ్, అమ్మిన వ్యక్తుల వివరాలు: A4). కొర్రా సీతా రాములు , A5) వంతాల విశ్వనాద్, A6). వంతాల బాబూరావు A7). కిలో చిన్నారావు , A8), కిలో సాయి బాబు,A9).కిలో శంకర్ రావు, A-10). పట్టుబడిన ఇద్దరూ వ్యక్తులను జ్యుడిషియల్ రిమాండ్ నిమిత్తం కోర్టు నకు తరలించడం జరిగినది. నిషేధిత గంజాయి అక్రమ రవాణాను సమర్థవంతంగా అడ్డుకుని నిందితులను చాకచక్యంగా పట్టుకున్న కొత్తగూడెం 1 టౌన్ సిఐ కరుణాకర్, ఎస్సై విజయ, సిసిఎస్ ఇన్స్పెక్టర్ రమాకాంత్, ఎస్సైలు ప్రవీణ్, రామారావు మరియు సిబ్బందిని ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ప్రత్యేకంగా అభినందించారు.

 

 

Facebook
WhatsApp
Twitter
Telegram