సారపాకలో రైస్ పుల్లింగ్ ముఠా ,
అదుపులోకి తీసుకున్న ఎస్ ఐ రాజేష్.
గోల్డెన్ న్యూస్ /భద్రాద్రి కొత్తగూడెం : బూర్గంపాడు మండలం సారపాకలో ఎస్ఐ రాజేష్ శనివారం మధ్యాహ్నం తన స్టేషన్ సిబ్బంది తో కలిసి సారపాక సెంటర్ వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనబడగా వారిని అదుపులోకి తీసుకొని తీసుకొని విచారించగా. దొనకొండ సురేష్ , ఎస్కే రహీం ఉర్ల శ్రీనివాస్ రావు అని తెలిపారు. వారి వద్ద రైస్ పుల్లింగ్ మిషన్ ఉన్నదని వ్యక్తులను నమ్మేస్తూ వారి వద్ద నుండి డబ్బులు తీసుకొని మోసం చేస్తూ ఉంటారు , చర్ల మండలం బతినపల్లి గ్రామం చెందిన రాజబాబును కూడా రైస్ పుల్లింగ్ మిషన్ ఉన్నదని నమ్మించి అతని వద్ద నుండి లక్ష రూపాయలు తీసుకొని అతను రైస్ పుల్లింగ్ మిషన్ ఇవ్వమని అడుగుతుండగా ఇంకా లక్ష రూపాయలు తీసుకొని బుర్గంపహాడ్ మండలం మణుగూరు x రోడ్ వద్దకు తేది 25.01.25 న సాయంత్రం అమ్మని చెప్పి అతను వచ్చిన తర్వాత అతనిని కొట్టి అతని లక్ష రూపాయలు బలవంతగా తీసుకొని కారులో జంగారెడ్డిగూడెంకు చెందిన నారాయణ తో కలసి తెలిపారు. శనివారం భద్రాచలం వెళ్ళుచుండగా సారపాక సెంటర్లో పోలీస్ లు పట్టుకున్నారు. మిగతావారు పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఎస్ఐ రాజేష్ మాట్లాడుతూ.. ప్రజలు ఈ విదంగా రైస్ పుల్లింగ్ మిషన్, గుప్త నిధులు ఉన్నాయని మరియు దొంగ నోట్లు మార్పిడి చేస్తామని అనే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండి మోసపోవద్దని మరియు అలాంటి వ్యక్తుల గురించి పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.