మేడారం అడవుల్లో పులి సంచారం

గోల్డెన్ న్యూస్ / ఏటూరునాగారం:జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్, ములుగు జిల్లా మేడారం టెరిటోరియల్ రేంజ్ల పరిధి సరిహద్దు అటవీ ప్రాంతాల్లో పులి సంచరిస్తోందని ఏటూరునాగారం రేంజ్ అధికారి అబ్దుల్ రెహమాన్ తెలిపారు. మహదేవపూర్, మేడార సరిహద్దు అడవిలో పులి ఒక గేదెను చంపినట్లుగా ఆనవాళ్లు లభ్యమయ్యాయన్నారు. శనివారం ఏటూరునాగారం ఎఫ్ఎవో ఆదేశాల మేరకు తాడ్వాయి మండలంలోని బయ్యక్కపేట, కాల్వపల్లి, నార్లాపూర్, కన్నాయిగూడెం మండలం ఐలాపూర్, ఏటూరునాగారం మండలం కొండాయి అడవుల్లో పులి సంచారం అడుగు జాడలు తెలుసుకునేందుకు అడవిలో పర్యటించినట్లు చెప్పారు. ఆయా గ్రామాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, భయాందోళనకు గురికావొద్దని పేర్కొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram