100 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి శంకుస్థాపన చేసిన మంత్రి లోకేష్

మంగళగిరిలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి శంకుస్థాపన చేసిన మంత్రి లోకేష్

గోల్డెన్ న్యూస్ /మంగళగిరి: శనివారం  100 పడకల ఆసుపత్రికి నారా లోకేశ్ భూమిపూజ చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు దీని నిర్మాణం చేపట్టారు. అత్యాధునిక వసతులతో ఏడాదిలోగా ఆసుపత్రి నిర్మాణం పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించారు. అనంతరం టిడ్కో నివాసాల వద్ద దివిస్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సురక్షిత తాగునీటి పథకాన్ని లోకేశ్ ప్రారంభించారు. మంగళగిరిలో ఈ ఏడాది 3 వేల మందికి ఇంటి పట్టాలు ఇచ్చినట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఇక్కడి పేదలకు రూ.వెయ్యి కోట్ల విలువైన భూమి ఇచ్చినట్లు చెప్పారు

Facebook
WhatsApp
Twitter
Telegram