గోల్డెన్ న్యూస్ / వికారాబాద్ : తాండూరు పట్టణంలోని పాత రైతుబజారులో చీరల కట్టలు కుప్పలుగా దర్శనమిచ్చాయి. చీరలు రైతుబజారులో ఎవరు పడేశారు తెలియదు కానీ . గత ప్రభుత్వం బతుకమ్మ సందర్భంగా మహిళలకు పంపిణీ చేయడం కోసం కేటాయించిన చీరల లాగానే ఉన్నాయి జిల్లాలోని తాండూరుతో సహా పలు ప్రాంతాల్లోని అధికారులు అందజేయ లేదు. వాటినే తాండూరులో నిరుపయోగంగా ఉన్న పాత రైతుబజారుకు తీసుకొచ్చి వృథాగా పడేశారని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చీరలను చిన్నారులు ఇక్కడి షెడ్లకు కట్టి ఊయలలా వాడుతున్నారు. వీటిని పేదలకు పంపిణీ చేసి ఉంటే ప్రయోజనం ఉండేదని పట్టణ వాసులు పేర్కొంటున్నారు. చీరలను రైతుబజారులో ఎవరు పడేశారో తమకు తెలియదని పురపాలక సంఘం అధికారులు తెలిపారు.
Post Views: 47









