గోల్డెన్ న్యూస్ /భద్రాద్రి కొత్తగూడెం : జిల్లా కేంద్రంలోని భారత కమ్యూనిస్టు పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ..సమానత్వం కోసం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడిన మహోన్నతమైన వ్యక్తి బిఆర్ అంబేద్కర్ అని అన్నారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె సాబీర్ పాషా సిపిఐ మాజీ కౌన్సిలర్లు కంచర్ల జమలయ్య, భుక్య శ్రీనివాస్, ధర్మరాజు, బండి నరసింహ, విజయ్, చారి, యూసుఫ్, పార్టీ నాయకులు ఉట్టి కొండ మల్లికార్జున్, వీరస్వామి, బత్తుల సురేష్, నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, క్రిస్టఫర్, భూక్యా దశ్రు, జక్కుల రాములు, మాజీ ఎంపీటీసీ సభ్యులు గోవింద్, గణేష్, రాజేష్, నేరెళ్ల రమేష్, మహిళా సమైక్య నాయకులు నున్న రత్నా కుమారి , భాగ్యలక్ష్మి, షాహిన్, ధనలక్ష్మి,ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఫాహీమ్, రంజిత్, రవి, సిపిఐ పార్టీ కార్యకర్తలు అంబేద్కర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 28









